నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గంలో ఈ నెల 23న జరగనున్న “శ్రీ శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 జయంతిని జయప్రదం చేయాలని సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొర్ర నాగు నాయక్, తాజా మాజీ ఎంపిపి రవితేజ నాయక్ కోరారు. శనివారం పట్టణంలోని ఎఫ్ సిఐలో హమాలీలకు సేవాలాల్ జయంతి ఉత్సవాల గురించి ఆహ్వాన పత్రాలు అందించి, కార్యక్రమానీకి హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యంత వైభవంగా నిర్వహించబడే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పాల్గొని, బోగ్ బండారూ కార్యక్రమంలో పాల్గొనాలని, స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని సూచించారు. గిరిజన వేషాధారణ, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఎంపిడిఓ కార్యాలయం నుండి బంజారా భవనం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు దాస్య నాయక్, భాస్కర్ నాయక్, బాలాజీ నాయక్, విజయ్ నాయక్, బాల నాయక్ తదితరులు పాల్గొన్నారు.





