నేటి సాక్షి, తిమ్మాపూర్: సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గులు అని తిమ్మాపూర్ మండలం రేణికుంట సర్పంచ్ ఎలుక ఆంజనేయులు అన్నారు. మంగళవారం గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీలనుద్దేశించి, ఆయన మాట్లాడారు. మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేశామన్నారు. రాజరాజేశ్వర హాస్పిటల్ డా. శిరీష అనిల్ సౌజన్యంతో మొదటి, రెండు, మూడో బహుమతులను అందజేస్తున్నట్లు చెప్పారు. మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, రాజరాజేశ్వర హాస్పిటల్ డాక్టర్ ఉపేందర్ రావు, శిరీష, అనిల్, శ్రీనివాస్ రెడ్డి బేతి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

