Wednesday, March 18, 2026

*సత్తెక్కపల్లిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ** పంచామృత అభిషేకాలు, భజన సంకీర్తనలు, వేటతుల్లి ఆటతో భక్తిశ్రద్ధలు*

నేటి సాక్షి – మెట్‌పల్లి*( రాధారపు నర్సయ్య )మెట్‌పల్లి మండలం సత్తెక్కపల్లి గ్రామంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కన్నెస్వాములు కట్ట భూమేశ్వర్, కట్ట పవన్ స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా అర్చకులు వంగల మారుతి చారి వైదిక నిర్వహణలో గణపతి పూజ, సుబ్రహ్మణ్య కలశ పూజ, గంటా పూజలతో పాటు అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి, 18 మెట్ల పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రత్యేకంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో మార్మోగాయి.అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు భజన సంకీర్తనలతో స్వామివారిని ఆలపిస్తూ కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు. పూజా కార్యక్రమం అనంతరం స్వామివారికి ఎంతో ఇష్టమైన వేటతుల్లి ఆటను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 18 మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి కర్పూరం వెలిగించగా, గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఎలిగేటి రమేష్, అంకతి భరత్ కుమార్, బసెట్టి హరిష్, చింత లవకుమార్, శ్రీరామెజి ప్రవీణ్, బెజ్జరపు రాధాకృష్ణ, అరె రమేష్, పుప్పాల రాజేష్, సోమ నరేందర్, తాటికొండ రామకృష్ణ, ఎలగందుల ఉదయ్, కోరుట్ల రాజు, సజ్జలపు శ్యాంసుందర్, బోబ్బిలి రాజశేఖర్, తాటికొండ రణధీర్, జిందం విష్ణు, కోటగిరి తిరుమలాచారి, తాటికొండ జయకృష్ణ, ఎలగందుల అఖిల్, జఢల మహేష్, ముక్క భరత్, జిల్లా సాయి, చెపురి రాము, పడిగెల నరేందర్, పత్తిపాక దామోదర్తో పాటు అయ్యప్ప స్వామి దీక్షాపరులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News