Monday, March 9, 2026

*సభ్యత్వంతో ప్రమాద బీమా,జనసేన పార్టీ ప్రత్యేక హామీ* *ప్రజలు జనసేన పార్టీకి చేరాలని నాయకుల పిలుపు*మంచిర్యాల జిల్లా,, మర్చి 09

నేటి సాక్షి చెన్నూర్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు సిద్ధూ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు మంతెన సంపత్ కుమార్, చెన్నూర్ నియోజకవర్గ నాయకులు జీవన్ వడ్లకొండ హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి అనుకోని ప్రమాదం జరిగిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయలు బీమా సహాయం అందించేందుకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారని తెలిపారు. ఈ భరోసాతో ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.అలాగే ప్రజలు స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌పై తమకు విశేషమైన నమ్మకం ఉందని, ఆయన ఆశయాలు ప్రజల సంక్షేమానికి దోహదపడేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణలో జనసేన పార్టీ లేదు అని చెప్పేవారికి సమాధానంగా ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు జనసైనికులుగా ముందుకు వస్తున్నారని నాయకులు తెలిపారు. భవిష్యత్తులో బలమైన ప్రణాళికతో పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాలు, నవీన్ గంధం పొన్నం సాయి, జీవన్, దుర్గం లక్ష్మణా చారి హరీష్, శ్రీనివాస్, అభిషేక్, రవీందర్, మధుకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News