నేటి సాక్షి,నల్లబెల్లి నవంబర్ 20 : సమగ్ర శిశు అభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలే పునాది వంటివని తాసిల్దార్ ముప్పు కృష్ణ, నర్సంపేట సిడిపిఓ మధురిమ, ఎంపీడీవో శుభనివాస్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం అంగన్వాడీ టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ శిశు ఆరోగ్యం, పోషణ, టీకా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, మహిళలపై హింస వంటి సమస్యలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో అంగన్వాడీ టీచర్లు ముందుండాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, టీకాలు, గర్భిణీల సేవల్లో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్, ఎంపీడీవో శుభనివాస్, ఎస్సైలు గోవర్ధన్, వెంకటరెడ్డి, ఎంఈఓ అనురాధ, ఏవో రజిత, నల్లబెల్లి, మేడేపల్లి వైద్యాధికారులు ఆచార్య, జ్యోతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.





