- బి.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ): బంజారాల ఆదర్శ దైవమైన సంత్ సేవలాల్ ను స్ఫూర్తితో, ఆయన ఆశయాలకు అనుగుణంగా గత బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సేవాలాల్ మహారాజ్ స్వప్నమైన తండా రాజ్యాన్ని సాకారం చేస్తూ రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చి, గ్రామ పరిపాలనలో బంజారాలను భాగస్వాములను చేశామని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహ రావు అన్నారు. సంత్ సేవాలాల్ 286 జయంతి ఉత్సవ సందర్భంగా శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీనరసింహారావు పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని అమ్మను పూజించాలే తప్పితే ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించిన గొప్ప వ్యక్తి సేవలాల్ మహారాజ్ అని, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారని గుర్తు చేశారు. యావత్ బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారని, అతని బోధనలు బంజారా జాతి పురోగమించడానికి కృషి చేసినట్లు తెలిపారు. బంజారాల అభ్యున్నతి కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని, సేవాలాల్ మహారాజ్ గొప్పతనాన్ని చాటేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకున్నామని, హైదరాబాద్ నగర నడిబొడ్డున సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో లంబాడా బిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా బంజారా భవన్ నిర్మించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంత్ సేవలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ధరావత్ ప్రకాశ్ నాయక్, ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, కమిటీ సభ్యులు లక్పతి నాయక్, దేవదాస్ నాయక్, నరేష్ నాయక్ మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవి, కిరణ్ రావు,భూమరెడ్డీ, దేవేందర్ రెడ్డి, సాయిరెడ్డి, వేంకటేశ్వర రావు, సాగర్ రావు, కిరణ్, రవీందర్,సాయన్న, మహేందర్, గంగాధర్, లింబాద్రి తదితరుల పాల్గొన్నారు.





