నేటి సాక్షి 05 :—.. అన్ని శాఖలలో పనిచేసే అధికారులు ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని ఉదయం 10 గంటలకు రావలసిన అధికారులు 12 గంటలైన ఆఫీసులో కుర్చీలు ఖాళీలుగా ఉన్నాయని పీజిఆర్ఎస్ లో కూడా అధికారులు డుమ్మా కొడుతున్నారని ఈ విషయంపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు డిమాండ్ చేశారు. గురువారం తాసిల్దార్ చంద్రశేఖర్ నాయకులు అధికారుల సమయపాలన పాటించడం లేదని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కలెక్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరుతున్న కార్యాలయాలకు సమయపాలనతో పాటించాలని చెబుతున్న కూడా అధికారులు మాత్రం స్పందించడంలో విఫలం చెందరన్నారు.. చాలా శాఖల్లో అధికారులు 12 గంటలైనా హాజరు కావడంలేదని కార్యాలయాలు ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయని,,ఈ విధానం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు,టీచర్లు సమయపాలన పాటించడం లేదన్నారు.. నేషనల్ సీడ్ ఫారం, కేసి కెనాల్ అధికారులతో పాటు చాలా డిపార్ట్మెంట్లో హాజరు కావడంలేదని కావున ఈ విషయంపై విచారణ చేయాలని ఎవరైనా సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.. నిర్లక్ష్యం చేస్తే అధికారి కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మక్బూల్ బాషా,మండల నాయకులు రాజు,పుల్లయ్య, దేవరాజు,సలీమ్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు..

