పది గంటలు దాటినా పత్తాలేని సిబ్బంది
డాక్టర్ల కోసం గర్భిణులు పడిగాపులు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : ధరూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణులు రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆసుపత్రి సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంతో సిబ్బంది కంటే ముందు వివిధ పరీక్షల కోసం ఆసుపత్రి వద్ద గంట తరబడి వైద్య సిబ్బంది కోసం ఎదురు చూడాల్సిన అవసరం వచ్చిందని సోమవారం ధరూర్ మండల కేంద్రంలోప్రాథమిక ఆరోగ్య హాస్పటల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు రోగులు నాన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్కార్ వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు పరచడంలో ఆసుపత్రి సిబ్బంది నిగ్గరుస్తున్నారు. 10:00 గంటలకు రావాల్సిన వైద్య సిబ్బంది 12:00 గంటలు దాటిన కూడా డ్యూటీ లోకి రావడం లేదు జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని గర్భిణులకు రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని విజ్ఞప్తి…