నేటిసాక్షి : జగదేవపూర్ అక్టోబర్ 23జగదేవపూర్ మండల కార్యాలయంలో ఈజీఎస్ అధికారులకు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. సిబ్బంది ఏప్పుడూ వస్తారో ఎప్పుడూ పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం పదకొండు గంటలు అవుతున్న కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఆపరేటర్ నుండి ఏపిఓ వరకు ఒక అధికారి కానీ సిబ్బంది కానీ హజరు కాలేదు. కార్యాలయంలో ఏపిఓతో పాటు టిఏ లు, సిసి, కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం మొక్కలు నాటే పనులు కూడా జరగడం లేదు. పశువుల పాకలు, తదితర పనులు సాగుతున్నాయి. కాగా సిబ్బంది మాత్రం సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా విధులకు హజరవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సంబధిత అధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.





