నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 27, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామంలో పలు వార్డులలో పలు సమస్యలను పసుపుల గ్రామ సర్పంచ్ నర్మదా రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పరిశీలించారు. శనివారం గ్రామంలోని పలు వార్డులలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు వార్డులలో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. పసుపుల గ్రామంలో శనివారం నాడు గ్రామానికి చెందిన ఒకరు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు భాను ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో 3000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అందజేయడం జరిగింది. గ్రామ సర్పంచ్, గ్రామ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది.

