నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా పరిధిలో గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. *మూడు మండలాల్లో ఎస్పీ పర్యటన*ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ హద్దుల్లో పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎస్పీ, అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రహరీ గోడలు, కరెంట్, తాగునీరు వంటి అవశ్యక సౌకర్యాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మొత్తం 122 గ్రామాలు, 1172 వార్డులలో నిర్వహించే ఎన్నికల కోసం 1172 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిగ్రహం పెట్టామని, షెడ్యూల్ ప్రకారం అక్కడ అదనపు బలగాలు మోహరింపజేస్తున్నామని పేర్కొన్నారు.*ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కఠిన చర్యలు*పోలింగ్ కేంద్రాల వద్ద BNSS-163 (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించిన ఎస్పీ, ఎన్నికల శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఎవరైనా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గొడవలు సృష్టించడం, ఓటరు ప్రలోభపరచడం, చట్టవిరుద్ధ చర్యలు ఏవైనా జరిగిన వెంటనే అరెస్ట్‌లు, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ ఎన్నికల ప్రక్రియలో పోలీసులు చేస్తున్న ఏర్పాట్లకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో సి.ఐలు అనిల్‌కుమార్, సురేష్, ఎస్.ఐలైన అనిల్ కిరణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.—





