Monday, March 23, 2026

*సమాజంలో మార్పు తెచ్చేది విద్యే*….*ఆ దిశగా టిడిపి పనిచేస్తోంది* *తెలుగుదేశం హయాంలోనే మారుమూల ప్రాంతాల అభివృద్ధి**అన్ని రకాల సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు**చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)*పలమనేరు*సమాజంలో మార్పు తెచ్చేది విద్యేనని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు తమ పిల్లలను బాగా చదివించాలని వారు దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ ప్రజలకు సూచించారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ, దొడ్డిపల్లి ఎస్టీ కాలనీలో రోప్స్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనులకు బియ్యం, నిత్యావసరాలు, సైకిళ్ళు పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అంతకు ముందు దొడ్డిపల్లి ఎస్టీ కాలనీకి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు రోప్స్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను వారు ప్రారంభించారు. అదేవిధంగా పలువురు విద్యార్థినీలకు సైకిల్స్ పంపిణి మరియు 50 పేద కుటుంబాలకు రేషన్ పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుమూల అటవీ ప్రాంతంలోని కాలనిలో సిసి రోడ్లు విద్యుత్ , ఇతర సౌకర్యాలు ఉండడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే, హరిజన గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరిగిందన్నారు. దొడ్డిపల్లి ఎస్టి కాలనీకి సౌకర్యాలు ఉన్నప్పటికీ చప్పిడిపల్లి నుంచి కాలనీ వరకు రోడ్డును త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల ప్రాంతాలలోని పేదలను గుర్తించి వారికి సాయం అందిస్తున్న రూప్స్ స్వచ్ఛంద సంస్థను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వాహకులకు వారు సుచించారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దొరస్వామి నాయుడు, బైరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ, పలమనేరు సింగిల్ విండో చైర్మన్లు వెంకట మునిరెడ్డి, పెద్దబ్బా పలమనేరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, ధనుంజయ రెడ్డి, వెంకటరత్నం, సెల్వరాజ్, గిరిబాబు అమర్నాథ్ రెడ్డి గిరిబాబు అమర్నాథ్ రెడ్డి, మంజులమ్మ,మంజులమ్మలతో పాటు రోప్స్ నిర్వాహకులు ధన శేఖర్, సిబ్బంది పౌల్ రాజ్, రమణమ్మ, సుభాషిని, అరవింద్ నిరంజన్ అరవింద్,నిరంజన్,గీత దీప, తదితరులున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News