Tuesday, March 10, 2026

సమ్మక్క–సారక్కలను దర్శించుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు నేడు బూరుగూడ గ్రామంలోని సమ్మక్క–సారక్క అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఇంటి నుండి డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా ఆలయానికి చేరుకుని, అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి కుమార్తె అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి భక్తి చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, గుండి రవీందర్, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, మాజీ సర్పంచ్ బలరాం, పొన్నాల నారాయణ, ప్రేమ్, సురేష్, సుప్రజ, సంగీత, ఉమ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News