Thursday, March 19, 2026

*సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించాడు* *రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు*——————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………..ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం,సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించాడని, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని హోం మంత్రిగా కూడా పనిచేశాడని, 560 కి పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతకు కృషి చేశాడని నిజాం నిరంకుశ పరిపాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కూడా కల్పించాడని అతని సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధనకార్యదర్శి అక్కినపెళ్లి కాశీ నాదం,చిట్ల గంగాధర్,బా.సు.స. కార్యదర్శి సింగం గంగాధర్,ఉపాధ్యక్షుడు వేముల పోచమల్లు, కొత్తకొండ బాలన్న, అనుమల భుజంగం,వేముల శంకర్,రాయికల్ రామచంద్రం,ఆర్ఎస్ఎస్ వీరన్న,ఎడమల వెంకట్ రెడ్డి, కె ఆర్ కృష్ణ చిలుక రాజన్న, బొందుకూరి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News