నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 1,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), గత లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల వేతనాలు ఒక్కొక్కరికి రూ,5000 రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన సర్పంచుల విధులను నిధులను బడ్జెట్లను అర్థం చేసుకొని మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కనీసం రూ 20 వేల వరకు గౌరవ వేతం పెంచే నిర్ణయం తీసుకోవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చర్చించుకుంటున్నారు.నారాయణపేట జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఎన్నికైన సర్పంచులు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం పనిమీద గ్రామ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి అప్పులు చేయవలసిన పరిస్థితి నెలకొన్నదని సర్పంచులు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు సక్రమంగా అందలేదని పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు. నిత్యవసరాల పెరుగుదలకు సర్పంచుల వేతనాలు పెంచాల్సిన బాధ్యత ఎంతో అవసరమని ఇక్కడి మేధావులు అంటున్నారు. నారాయణపేట జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి కి తీర్మానం చేసి సహకరించాలని నారాయణపేట జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

