నేటి సాక్షి నారాయణపేట, డిసెంబర్ 6, నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ సర్పంచ్, ఆయా వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులు కేటాయించడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలెం శివయ్య, జి. లక్ష్మయ్య లు తెలిపారు. శనివారం మరికేలో స్థానిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థులు చెన్నయ్య కు గుర్తు, జోగు రామస్వామికి కత్తెర గుర్తు, బ్యాగరి రవికి బ్యాట్ గుర్తు, సీమ శివకుమార్ కు బ్యాట్ గుర్తు లను కేటాయించడం జరిగిందని వారు వివరించారు. అదేవిధంగా మరికల్ గ్రామంలోని ఆయా వార్డులలో నామినేషన్ వేసిన సభ్యులకు గుర్తులు కేటాయించడం జరిగిందని వారు వివరించారు. ఈ సమావేశంలో మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





