నేటి సాక్షి, ధర్మారం (ఫిబ్రవరి 11) : ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో బుధవారం సర్పంచ్ మోతె కనకయ్య ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ 9, 10వ వార్డులను సందర్శించి, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, పింఛన్లు వంటి సమస్యలను సర్పంచ్ స్వయంగా స్థానిక ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని నమోదు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం గ్రామాభివృద్ధికి ఎంతో కీలకం అని ప్రతి ఒక్కరు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోతె కావ్య వెంకటస్వామి, వార్డు సభ్యులు తొట్ల లక్ష్మీ, జెంగిలి గట్టుస్వామి, వివోలు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

