నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………………సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొందామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజేంగి నందయ్యతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… గత అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, సర్పచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. కేటీఆర్, హరీష్ రావులు గడిచిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పై వ్యక్తిగతంగా విమర్శించారు,కాని ప్రజలు జవాబు చెప్పారని అన్నారు. తనపై కొప్పుల ఈశ్వర్ అభివృద్ధి విషయంలో వీడియోలు చూపిస్తూ సంవత్సరంలో ధర్మపురికి చేస్తానన్న హామీలు నెరవేర్చలేదని ధర్మపురి ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ ఈశ్వర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. వెల్గటూరు మండలం పైడిపెల్లి ఘటనపై ఎస్పీని విచారణకు ఆదేశించా ఘటనకు భాద్యులైన వారిపై, పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.





