Wednesday, March 25, 2026

*సర్పంచ్ ఎన్నికల వేళ బిఆర్ యస్ కు బిగ్ షాక్..**- కాంగ్రెస్ లో చేరిన హనుమాన్ తండా యువకులు..**- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మానాల మోహన్ రెడ్డి..*

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )స్థానిక సంస్థల ఎన్నికల వేళ బిఆర్ యస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రుద్రంగి మండలం మానాల గ్రామంలోని హనుమన్ తండాకు చెందిన సుమారు 35 మందికి పైగా బిఆర్ యస్ పార్టీ అనుచరులు శుక్రవారం కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి ఆధ్వర్యంలో హనుమాన్ తండా యూత్ అధ్యక్షుడు తిరుపతి, ఉప అధ్యక్షుడు వినోద్, కార్యదర్శి రవి, దేగావత్ కళ్యాణ్ తో పాటు మరో 30 మంది సభ్యులను రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కాబట్టే ఇతర పార్టీల నుండి యువత నాయకులు కార్యకర్తలు ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరుతున్నారని మొన్నటికి మొన్న ఉమ్మడి మానాలకు చెందిన దాదాపు 200 మంది కి పైగా టిఆర్ఎస్, బిజెపిల నుండి చేరారని, అందులో భాగంగా నేడు ఉమ్మడి మానాల కు చెందిన హనుమాన్ తండా టిఆర్ఎస్ యూత్ సభ్యులు 30 మంది పార్టీలో చేరారని వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. రానున్న రోజులలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల సహకారంతో ఉమ్మడి మానాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జుల దిలీప్, విడిసి చైర్మెన్ అంగారకుల మహేష్, బోరగల్ల రవి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News