*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల పిల్లలకు విందు భోజనం ఏర్పాటు చేసి వారితోపాటు భోజనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సహకారంతో పాఠశాలలో గదుల కొరత మరియు ఇతర సమస్యలను తీరుస్తామని పాఠశాల సిబ్బందికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగనూరి నర్సాగౌడ్, చిన్నాపూర్ ఉప సర్పంచ్ చట్ట శ్రీనివాస్, బుర్ర రమేష్, కుంటాల నాగరాజు, గడ్డం రమేష్ యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

