నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 17 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని పెదరాస్పల్లి గ్రామ సర్పంచ్ గా బీ ఆర్ఎస్ పార్టీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరిస్తే సర్పంచ్ గా పోటీ చేస్తున్న బొమ్మెర రాజన్న. ఈరోజు బుధవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గమనించి కాగజ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు బాధితుని కుటుంబ సభ్యులు మంచిర్యాల లేక కరీంనగర్ కు తరలించేందుకు సిద్ధమవుతున్నారు.





