నేటి సాక్షి, తిమ్మాపూర్:స్థానిక సంస్థల ఎన్నికల్లో తిమ్మాపూర్ మండలంలోని రాంహన్మాన్ నగర్ సర్పంచ్ గా గెలిచిన బీజేపీ కార్యకర్త పిస్క సౌజన్య-కృష్ణకిషోర్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ శాలువాతో సన్మానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులకు బుధవారం సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ సౌజన్య, ఉప సర్పంచ్ అందె శేఖర్,వార్డు సభ్యులు మెండె రాధ, గుంటుక లత, ఉప్పులేటి ప్రవీణ్, కర్ణకంటి శ్రీనివాస చారి, పోరండ్లకు చెందిన నాంపల్లి సత్తయ్య, పఠాకుల చుక్కయ్య, బాలయ్యపల్లి వార్డు సభ్యుడు జాడి రాజు, వచ్చునూర్ వార్డు సభ్యులు వీణవంక అంజికి సన్మానం చేసి, శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని దైర్యం గా ప్రజలకు సేవ లు చేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు గడ్డం అరుణ్, వేల్పుల రవీందర్ యాదవ్, తక్కిటి దేవేందర్ రెడ్డి, ఉప్పులేటి జీవన్, గుంటుక రాజ్ కుమార్, మారం శివ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.





