Saturday, March 21, 2026

*సర్పంచ్ పదవికి రూ.28.6 లక్షల వేలంపాట** జగ్గసాగర్‌లో ప్రజాస్వామ్యానికి బ్రేక్ * ఊరినే వెలి వేసిన విడిసి**

నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల సంఘం నిర్వహణలో మొదటి విడతకు సంబంధించి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవికి BC రిజర్వేషన్‌తో పాటు వీడీసీ సభ్యులు రహస్యంగా వేలంపాట నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తి రూ.28.60 లక్షలకు పదవిని దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉండగా, ఎన్నికల నియమాలకు విరుద్ధంగా జరిగిన ఈ వేలంపాటను అడ్డుకున్న గ్రామస్తులపై గ్రామ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ బెదిరింపులు జారీ చేశారు. ఉపసర్పంచ్, వార్డ్ సభ్యుల పదవులకు కూడా వేలంపాటలు జరుగుతున్నట్లు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు, గురటి కాపు సంఘ సభ్యులు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల పంపిణీ వివాదాలు కూడా ఈ ఘటనకు కారణాలుగా కనిపిస్తున్నాయి.!*వీడీసీ సభ్యుల రహస్య వేలంపాట*జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవి BC కేటగిరీకి రిజర్వ్ కావడంతో 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, గ్రామ వీడీసీ సభ్యులు ఏ సమాచారం ఇవ్వకుండానే, రహస్యంగా వేలంపాట నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఓ వ్యక్తి సుమారు రూ.28.60 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడని ఫిర్యాదు చేసిన గ్రామస్తులు తెలిపారు. మంగళవారం నుంచి ఉపసర్పంచ్ పదవితోపాటు వార్డ్ సభ్యుల పదవులకు కూడా వేలంపాటలు జరుగుతున్నాయని, ఇది రాజ్యాంగ బద్ధంగా నిర్వహించాల్సిన ప్రజాస్వామ్య ఎన్నికల నియమాలకు పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు. ఈ వేలంపాటలు గ్రామ అభివృద్ధి పేరిట వీడీసీ ఆగడాలకు అడ్డుకట్ట పడేలా మారాయని, అధికార యంత్రాంగం దీనికి మౌనంగా ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.*అడ్డుకున్న గ్రామస్తులకు బహిష్కరణ బెదిరింపులు* వేలంపాటలను అడ్డుకుని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని కోరిన గ్రామస్తులకు గురటి కాపు సంఘ సభ్యుల నుంచి తీవ్ర బెదిరింపులకు గురయ్యారు. వీడీసీ సభ్యులు వారిని గ్రామ బహిష్కరణ చేసి..’మాతో ఎవరూ మాట్లాడకూడద’ని హుకుం జారీ చేశారు. కిరాణా షాపుల్లో నిత్యావసర వస్తువులు కొనకూడదు, స్థానిక డాక్టర్లు వారికి చికిత్స అందించకూడదు, వేలంపాటలో వచ్చిన డబ్బులు వారికి దక్కకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ బహిష్కరణకు కారణంగా గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొన్నట్లు ఫిర్యాదు చేసినవారు తెలిపారు. ప్రధాన వీడీసీ సభ్యులు, కొందరు గ్రామస్తులు కలిసి ఈ బెదిరింపులకు పాల్పడ్డారని, ఇది ఎన్నికల నియమాలకు విరుద్ధంగా గ్రామస్తులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.*ప్రభుత్వ భూముల వివాదం* జగ్గసాగర్ గ్రామ శివారులోని వరద కాలువ కోసం సేకరించిన నిధులతో మిగిలిన ప్రభుత్వ భూమిని వీడీసీ సభ్యులు సంఘాల వారిగా కేటాయించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి గ్రామంలోని పశువుల కోసం గ్రామస్తులంతా ఆ భూమిని వాడుకుంటున్నారు. అయితే, ఈ ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడానికి వీడీసీ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా నిలబడి..’ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడం ఏమిటి.?’ అని ప్రశ్నించిన గ్రామస్తులు మరోసారి బహిష్కరణకు గురయ్యారు. భూమి పంపకాలను అడ్డుకున్నందుకు ప్రధాన వీడీసీ సభ్యులు, కొందరు గ్రామస్తులు కలిసి వారిని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వివాదం వీడీసీ సభ్యుల వేలంపాటలకు మరింత బలం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.*పోలీస్ ఫిర్యాదు-ఎన్నికల అధికారికి దృష్టి* ఈ ఘటనలన్నీ భరించలేక, గురటి కాపు సంఘ సభ్యులు తోపాటు బాధిత గ్రామస్తులు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులతోపాటు ఎన్నికల అధికారికి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా, మండల అధికార యంత్రాంగం వీడీసీ సర్పంచ్ పదవికి నిర్వహించిన వేలంపాటపై విచారణ జరిపి ఏ చర్యలు తీసుకుంటుందో అందరూ వేచి చూస్తున్నారు. ఈ ఘటన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో విడిసి ఆగడాలు, అధికార యంత్రాంగం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార యత్రాంగం ఈ విడిసి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్హం.!_____________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News