నేటి సాక్షి, బెజ్జంకి: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఎంపీపీ లింగాల నిర్మల, ఎంపీడీవో లక్ష్మప్ప, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సభ నిర్వహణకు సరిపడా కోరం సభ్యులు లేనందువలన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో ప్రకటించారు. తిరిగి సమావేశ తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు.