నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………..సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలనిపి ఆర్ టీ యు టీ ఎస్ ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎఐజాక్టో పిలుపు మేరకు పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బోయినిపెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 న సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ “చలో ఢిల్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించారు. *ఈ సందర్భంగా ఆనందరావు, అమర్నాథ్ రెడ్డిలు మాట్లాడుతూ*విద్య హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 23 ను సవరించి 2010 కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి ధర్నాకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు ఎ వి న్ రాజు,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాసిత్, రాష్ట్ర కార్యదర్శి అనూజ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీదేవి, బాధ్యులు హరీష్, ఆత్మ చరణ్ రావు, అనిల్ రావు, శ్రీనివాస్, రాజశేఖర్, గంగారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.





