Friday, March 20, 2026

సస్పెన్స్ వీడిన తంబళ్లపల్లి ఎంపీపీ పదవి..అందరూ భావించినట్టే ఎంపీపీగా కోటిరెడ్డి శ్యామలమ్మ ఎన్నిక..ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగిన ఎన్నిక..ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు గురువారం 11 గంటలకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి ఎంపీపీ గా ఉన్న అనసూయమ్మ ఈ ఏడాది అక్టోబర్ 13న తన వ్యక్తిగత కారణాలవల్ల ఎంపీపీ పదవికి రాజీనామా చేసింది. ఎంపీపీ అనసూయమ్మ పై పది మంది ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అక్టోబర్ 27వ తేదీన ఎంపీడీవో పట్నాయక్ మెజారిటీ ఎంపీటీసీల ఆమోదంతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఆదేశాల మేరకు కోసువారిపల్లి ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షురాలు చిటికి శ్యామలమ్మను ఇంచార్జ్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 11వ తారీకున గురువారం మండలంలోని 11 మంది మెజారిటీ ఎంపీటీసీలు ఆమోదంతో ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ విలేకరులకు వెల్లడించిన విషయం తెలిసిందే. అదే తడవుగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నికను అబ్జర్వర్ జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ పర్యవేక్షణ లో ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాపూజీ పట్నాయక్ లు తంబళ్లపల్లి లో ఎంపీపీ పదవికి ఎన్నిక నిర్వహించారు. తంబళ్లపల్లి ఎంపీపీ గా వైయస్ ఆర్ సిపి కి చెందిన కోసువారిపల్లి ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఒక్కటే నామినేషన్ వేయడం తో 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా పది మంది హాజరు ఒక్క ఎంపీటీసీ సభ్యురాలైన మాజీ ఎంపీపీ అనసూయమ్మ గైర్ హాజరు కావడం తో మిగిలిన తొమ్మిది మంది సభ్యులు ఎద్దుల ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీ హరిత, కన్నెమడుగు ఎంపీటీసీ మహేష్ మరియు మిగిలిన సభ్యులు శ్యామలమ్మ ను మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చిటికి శ్యామలమ్మకు ఎంపీపీ పదవి వరించింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి ఆమోదం తెలుపుతూ మీడియాకు సంబోధించారు. 9 మంది సభ్యులు ఏకమై అందరు ఏకగ్రీవం గా మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ గా శ్యామలమ్మ కు ఎన్నికైనట్లు ఆమోదం తెలిపారు. ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి తో పాటు ఆయన సిబ్బంది కట్టిదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగి ఎంపీపీగా చిటికి శ్యామలమ్మ ఎన్నికయ్యారు. శ్యామలమ్మ ఎంపీపీగా ఎన్నికవ్వడంతో తంబళ్లపల్లి మండల వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ శ్యామలమ్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్యామలమ్మ మాట్లాడుతూ ఈ పదవి రావడానికి ఎంపీపీగా గెలవడానికి మద్దతిచ్చిన తోటి ఎంపీటీసీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని వీరంతా మద్దతు ఇవ్వబట్టే ఎంపీపీగా గెలిచాను. ముఖ్యంగా నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన సహకారంతోనే ఎంపీపీ గా ఏకగ్రీవంగా గెలిచాను. తంబళ్లపల్లి ప్రాంతాన్ని ద్వారకానాథ్ రెడ్డి సహకారంతో ఎంపీటీసీల ఐక్యతతో మరింత అభివృద్ధి బాటలో నడుపుతానని శ్యామలమ్మ తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల సీనియర్ నాయకులు సురేంద్రనాథ్, మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర, ములకలచెరువు బూత్ కమిటీ అధ్యక్షుడు బోనాల చాంద్ భాష, జిల్లా ప్రచార ఉపాధ్యక్షుడు టంగుటూరి విశ్వనాథ్, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కవిత, శ్యామల, అప్పిరెడ్డి, హరిత, కరీం, సరోజమ్మ, కళావతి, రామకృష్ణ, జయమ్మ, వైసీపీ శ్రేణులు కిషోర్ రెడ్డి, శివారెడ్డి, నరేందర్ రెడ్డి, ఎరికల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News