Tuesday, March 3, 2026

సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ నితికా పంత్

నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారు శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. హానికరమైన రసాయనిక రంగులు వాడరాదు – సహజ రంగులకే ప్రాధాన్యంఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం నిషేధమని స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాల్లో అవాంఛనీయ ప్రవర్తనకు అనుమతి లేదుప్రార్థనా మందిరాలు, రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా – షీ టీమ్‌ల ముమ్మర పహారామహిళల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్‌లు ప్రత్యేకంగా మోహరించి, ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలుపండుగ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, ఉల్లంఘనలకు ఎలాంటి సడలింపులు ఉండవని హెచ్చరించారు. అతివేగం ప్రమాదకరం – యువత అప్రమత్తంగా ఉండాలిరోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రమాదాలపై అప్రమత్తత అవసరంఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లవద్దని, పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం, గొడవలు సహించబోవుసామాజిక మాధ్యమాల్లో అపోహలు వ్యాప్తి చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News