నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) *రామచంద్రాపురం:* విద్యార్థులతో కలిసి ఉంటేఉపాధ్యాయులు సహ పంక్తి భోజనం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డ్ డైరెక్టర్ చినబాబు సూచించారు. శనివారం రామచంద్రాపురం మండలం కమ్మపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నామన్న భావన విద్యార్థుల్లో కలుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి విద్యార్థులకు ఆహార విషయంలో ఎటువంటి లోటు లేకుండా చేస్తున్నారని, దీనిని ఉపాధ్యాయులు గ్రహించి విద్యార్థులతో మమేకం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి హేమాంబరరావు, వనమాలి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సభాపతి,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు




