చిత్తూరు పార్లమెంటు సభ్యుని కలిసిన ఎఫ్ ఆర్టీఐ టీమ్**ఎఫ్ ఆర్టీఐ సభ్యులను ప్రశంసించిన చిత్తూరు ఎంపీ* *చిత్తూరు* సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఫోరమ్ ఫర్ ఆర్టీఐ టీమ్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎఫ్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం పై రూపొందించిన బేర్ ఆక్ట్ ను చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఆవిష్కరించారు. ఎఫ్ ఆర్టీఐ నీతి నిజాయితీగా ప్రజల కోసం స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలను ప్రత్తిపాటి చంద్రమోహన్ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ..ఎఫ్ ఆర్టీఐ సభ్యుల సేవలను ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతిని అరికట్టేందుకు, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఆర్టీఐ దోహదపడుతుందని అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సమాచార హక్కు చట్టం ఏర్పడిందని గుర్తు చేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ.., దీని అమలు దేశంలోని ఏపిలో ఐదో స్థానంలో ఉందని తెలిపారు. చిత్తూరు ఎంపీనీ కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి పాటిబండ్ల శేఖర్ బాబు, బేతాళం నరసరాజు,మాజీ ఎంపీటీసీ వై. గోపి తదితరులు ఉన్నారు.