నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 23 మండలంలోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల పండుగకు చెందిన దేవర ఎద్దుకు సాంప్రదాయపద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు, దేవర ఎద్దు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది మర్రిమాకులపల్లి కాగతి పంచాయతీలకు చెందిన రైతులు చుట్టుపక్కల ప్రాంతాల వారు మర్రిమాకులపల్లికి చేరుకొని దేవల ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు రాజనాల బండ అర్చకులు సాంప్రదాయపద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ, చేరుకోవడంతో ఆ ప్రాంతం దేవర ఎద్దు నామస్మరణతో మార్మోగింది 14 సంవత్సరాల క్రితం గాజులవారి పలికి చెందిన రైతు కుటుంబం నుంచి దేవరయద్దును రాజనాల పండుగకు సమర్పించారు, నివాళులర్పించిన రమేష్ రెడ్డి : రాజనాల బండ దేవర ఎద్దు మరణించింది అన్న వార్త వినగానే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి. మర్రిమాకులపల్లి కి చేరుకున్నారు దశాబ్దాల తరబడి స్వామివారికి సేవలందించిన దేవరెద్దుకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





