నేటిసాక్షి, మిర్యాలగూడ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను నిరసిస్తూ, శుక్రవారం మిర్యాలగూడ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలోమిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని,పత్రిక స్వేచ్ఛను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ జర్నలిస్ట్ లు నినాదాలు చేశారు.అనంతరం పలువురు జర్నలిస్ట్ లు మాట్లాడుతూ, రాజ్యాంగంలో నాలుగో స్తంభం గా పేర్కొంటూనే ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తుందని, సాక్షి కార్యాలయనికి పోలీసులు నోటీసుల పేరిట ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, పత్రిక స్వేచ్ఛను కాపాడాలి డిమాండ్ చేశారు. అదే విధంగా ఎపిలో సాక్షి టివి ప్రసరాలను కూడా అడ్డుకుంటుదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లు వాడపల్లి రమేష్, ఎండి అస్లాం, అయ్యబ్. రంగా శ్రీనివాస్, ఖాజా నాజీముద్దీన్, నామిరెడ్డి నరేందర్ రెడ్డి సునీల్, జంగా లక్ష్మణ్, కాతోజు నాగాచారి, రాచకొండ రమేష్, బాలాజీ రావు, కరుణాకర్, అశోక్, వేణుగోపాల్ రెడ్డి, వెంకన్న రామకృష్ణ, పుప్పాల యాదగిరి, శేఖర్, వెంకటేశ్వర్లు, మంద.లక్ష్మణ్, హరీష్, తోఫిక్, రఫీ, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.




