Monday, March 9, 2026

సామాజిక మార్పుకోరే నాటికలు….. మనస్సు ఉత్తేజపరిచే జానపదాలు….. అందర్నీ ఆకట్టుకున్న విద్యార్థులు…..

నేటి సాక్షి, నారాయణపేట,మార్చి 8, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లాలోని మండల పరిధిలోని జాజాపూర్ ఉన్నత పాఠశాల యందు శనివారం రాత్రి పాఠశాల వార్షికోత్సవంబడిపండగ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభా నైపుణ్యాలను వెలికితీయడానికే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి అన్నారు. పాఠశాల ప్రగతి కోసం ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారం ఉంటే బడి ఇంకా వికసిస్తుందని కోరారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు.అబ్బురపరిచిన నాటికలు….. ఉత్తేజపరిచిన నృత్యాలు…..ఈ వార్షికోత్సవంలో విద్యార్థులుస్వయంగా అభ్యసించి ప్రదర్శించిన ప్లాస్టిక్ భూతంతో కష్టాలు,వృక్షో రక్షితి రక్షితః, చదువు విలువ, రోడ్డు భద్రత అభినయ నాటికలు, పల్లెటూరి సుద్దులు, గ్రామ దేవత ఎల్లమ్మ, శ్రీరాముని స్మరణ, శివతాండవం, కత్తులతో సైరా నరసింహారెడ్డి పౌరుష ప్రదర్శన, మనసును ఉల్లాసపరిచే, సామాజిక చైతన్యం కలిగించే జానపద నృత్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచి ఆలోచింప జేశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగీత రాములు, ఉప సర్పంచ్ లక్ష్మణ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మణెమ్మ,గ్రామ యువ నాయకులు కోట్ల రవీందర్ రెడ్డి,మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షులు క్రాంతి కుమార్, వార్డు సభ్యులు లింగప్ప పాఠశాల ఉపాధ్యాయ బృందంవివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News