Saturday, March 21, 2026

*సాయి ఈశ్వర్ చారికి కోరుట్లలో ఘన నివాళులు** స్వర్ణకార యువజన వ్యాపార సంఘం ఆధ్వర్యంలో సంతాపం* 42% బీసీ రిజర్వేషన్ కోసం అమరుడైన యువకుడి త్యాగాన్ని స్మరించిన నాయకులు—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్లలో స్వర్ణకార యువజన వ్యాపార సంఘం ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర్ చారికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నేతలు, సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి మౌన వ్రతం పాటించారు.*కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసగించిందన్న ఆరోపణ*ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఇందూరి ప్రసాద్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారిలా… ఇప్పుడు బీసీ హక్కుల కోసం సాయి ఈశ్వర్ చారి తన ప్రాణాలర్పించాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం తప్పించి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవించి, బీసీల అభ్యున్నతికి సరైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సంతాప కార్యక్రమంలో వ్యాపార సంఘం అధ్యక్షుడు బెజ్జరపు పెద్దోళ్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడు దురిశెట్టి కర్ణాకర్, స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాముల ప్రశాంత్, రాష్ట్ర నాయకులు పబ్బోజి లక్ష్మినారాయణ, మండలోజు రవీందర్, కార్యదర్శి తొగిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి సంఘాలు అండగా ఉంటాయని, బీసీ హక్కుల కోసం అన్ని సంఘాలు ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, వ్యాపార వర్గాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News