Monday, March 9, 2026

*’సావిత్రిబాయి ఫూలే ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకున్న కోరుట్ల అంగన్వాడీ టీచర్** ఢిల్లీ వేదికగా సాయీశ్వరికీ ఘన సన్మానం* సాయీశ్వరీకి అభినందనల వెల్లువ————————-*

నేటి సాక్షి – కోరుట్ల*(రాధారపు నర్సయ్య)కోరుట్ల పట్టణానికి చెందిన అంగన్వాడీ టీచర్ మ్యాకల సాయీశ్వరీ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మహిళా సాధికారత, సమాజ సేవలో చేసిన విశిష్ట కృషిని గుర్తిస్తూ అమెరికాకు చెందిన లూసియానా యూనివర్సిటీ 2026 సంవత్సరానికి గాను ప్రదానం చేసే ‘సావిత్రిబాయి ఫూలే బెస్ట్ ఉమెన్ లీడర్‌షిప్ ఇంటర్నేషనల్ అవార్డు’ను ఆమెకు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.*సాయీశ్వరీకి ఢిల్లీలో ఘన సన్మానం*’మార్చి 8న-అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు మహిళా నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో లూసియానా యూనివర్సిటీ ప్రతినిధులు సాయీశ్వరికీ అవార్డు, ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. ఆమె సేవలను కొనియాడుతూ పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.*అంగన్వాడీ సేవలకు గుర్తింపు*కోరుట్ల పట్టణ కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న మ్యాకల సాయీశ్వరీ, బాలల సంక్షేమం, మహిళా సాధికారత దిశగా అనేక సంవత్సరాలుగా నిబద్ధతతో సేవలందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం పలు ఉద్యమాలు నిర్వహించారు. వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ఆమె చేసిన పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో నేషనల్ డైరెక్టర్ డాక్టర్ రాధికా, నేషనల్ సెక్రటరీ డాక్టర్ రమేష్ దిగంకురి, స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వారు సాయీశ్వరి సేవలను అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.*సాయీశ్వరీకి అభినందనల వెల్లువ*సాయీశ్వరీకీ అంతర్జాతీయ అవార్డు లభించడంపై అంగన్వాడీ టీచర్ సంఘాల నాయకులు, సహచరులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ స్థాయి గౌరవం వరకు ఆమె చేసిన ప్రయాణం అనేక మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కోరుట్ల పట్టణానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు._________________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News