నేటి సాక్షి మార్చి 19 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా లో శ్రీ పరాభవ నామ సంవత్సర తెలుగు వారి తొలి ఉగాది పండుగ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కష్టసుఖాల సమ్మేళనమే ఈ జీవితం , ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కష్టాలను కడతేర్చి , సుఖశాంతులను ప్రజలందరికీ ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న , అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, నాయకులు రాంరెడ్డి , పర్వతాల యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





