నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 2 చౌడేపల్లి మండలంలోని ఆమీని గుంట పంచాయతీ సంబంధించిన అగ్నిప్రమాదంలో రూ 20 వేలు ఆస్తి నష్టం జరిగిందని, పుంగనూరు అభిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు… సింగగిరి గుట్టకు సమీపంలో ఎం ప్రకాష్ కు చెందిన టమోటా చెట్లపై నాటే కట్టెలు పొలం వద్ద ఉన్నాయి అందులో నుంచి మంటలు చెలరేకడంతో చుట్టుపక్కల వారు. ఆర్పే ప్రయత్నం చేశారు, సమాచారం అందుకున్న పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది తరలివచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు, ఈ మంటలలో కట్టెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి జుట్టు తిరిగిన వ్యక్తులు ధూమపానం సేవించి మండుతున్న ముక్కలు పడేయడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని సుబ్బరాజు వివరించారు.





