నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………..సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాలని జగిత్యాలకు చెందిన ప్రముఖ న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఉద్యమం చేస్తున్నారు.మధుసూదన్ రెడ్డి కి 2025 మే లో క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యుంది. అప్పటి నుండి బసవ తారకం హాస్పిటల్ లో చికిత్స చేసుకుంటు క్యాన్సర్ గూర్చి పోరాటం చేస్తున్నారు. సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం గూర్చి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ వ్యాధి బారిన ఇతరులు పడకుండా చర్యలు చేపట్టాలని, పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. జగిత్యాలలోని విద్యాసంస్థలు, న్యాయవాదుల ద్వారా ఇప్పటికి పది వేల పోస్ట్ కార్డుల ద్వారా సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కోసం మధుసూదన్ రెడ్డి ఉద్యమం చేస్తున్నారు.





