Tuesday, January 20, 2026

సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసా..!ప్రసాదంలో నత్త వచ్చిందని దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమా..! నాగార్జున యాదవ్

నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ~మదనపల్లి -:- కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా అంటూ నాగార్జున యాదవ్‌ నిలదీశారు. ”ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడని ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దని సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసిందని ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారని ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చిందని దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇదే నిదర్శనమని నాగార్జున యాదవ్ విమర్శించారు. ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున యాదవ్‌ డిమాండ్‌ చేశారు.~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News