నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతిపేదలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహానిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణి చేశారు. మధురానగర్ కు చెందిన భ్రమరాంబ కు ఒకటిన్నర లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. అలాగే మధురానగర్ కే చెందిన గణేష్ కు నలభై ఆరువేల యాభై ఒక్క రూపాయల చెక్కును ఆయన భార్యకు ఎమ్మెల్యే అందించారు. ఎల్ బి నగర్ కు చెందిన ప్రేమ్ కుమార్ కు లక్షా డెబ్బై ఐదు వేల రెండు వందల ఒక్క రూపాయల చెక్కు రాగా దాన్ని ఆయన కూన కుమారునికి ఎమ్మెల్యే అందించారు. అలాగే ఎల్ బి నగర్ కే చెందిన మణికంఠ కు యాభై వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజా రెడ్డి, ఆముదాల వెంకటేష్, జానకిరామ రెడ్డి, రాజేష్ అచ్చారి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.





