నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……రాయికల్ పట్టణానికి చెందిన బైరి లక్ష్మణ్ అనే వ్యక్తి ఆగస్టు 23వ తేదీన జగిత్యాలలోని సిగ్మా హాస్పిటల్ లో హృదయ సంబంధ వ్యాధితో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించి జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాసు ను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించగా ,గురువారం స్థానిక మోతే వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా ఆరోగ్య శ్రీ తరపున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, సిగ్మా హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది హాజరయ్యారు.కార్డియాలజీ నిపుణులు అనివార్య కారణాలవల్ల విచారణకు హాజరు కాలేదని తెలిపారు. వారిని విచారించి నివేదికను జిల్లా వైద్యాధికారికి సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ సురేష్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.




