హనుమకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో హరిజనవాడ పాఠశాలలో గురువారం టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా.హిమబిందు ఆధ్వర్యంలో టిబి,హెచ్ఐ వి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ డిఎంచ్ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో 24మందికి తెమడ పరీక్షలు, 27మందికి హెచ్ఐ టెస్టు చేయడం జరిగినది ఇందులో ఇద్దరికి ఎక్శేరే తీయడం జరిగిందని డా. హిమబిందు తెలిపారు. టెస్ట్ రిపోర్ట్స్ రావలసి ఉందని, టీబీ ముక్తూ భారత్ అభియాన్ గురించి ఆయుష్మాన్ భారత్ 2 కి టిబి ల్యాబ్ రిపోర్టర్ అచ్యుత రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. హిమ బిందు, ఏఎన్ఎం సులోచన, విజయ నిర్మల, హెల్త్ అసిస్టెంట్ సంతోష్ మోసిన్, టిబి ల్యాబ్ రిపోర్టర్ అచ్యుతరావు ఇంద్రారెడ్డి ఆశాలు పాల్గొన్నారు.

