నేటి సాక్షి తిరుపతి విలక్షణ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబును చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీ విద్యా నికేతన్ ఆవరణ లోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆప్యాయంగా పలుకరించి యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మోహన్ బాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ బాబును కలిసిన వారిలో చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు భాను కుమార్ రెడ్డిలు వున్నారు.

