నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 18,పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలతో ప్రత్యక్షంగా పనిచేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి ప్రాథమిక సిపిఆర్ పద్ధతులు తెలుసుకోవడం ఎంతో అవసరం అని శిక్షణను సద్వినియం చేసుకొని మరింత సమర్థవంతంగా గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసులకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో లైఫ్ సేవర్ అసోసియేషన్ ఢిల్లీ వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ గారు సిపిఆర్ చేయు విధానంపై ప్రాక్టికల్ గా జిల్లా పోలీసులకు అవగాహన కల్పించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… సిపిఆర్ అనేది అత్యవసర సమయంలో హాస్పిటల్ కి వెళ్ళే లోపు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి సిపిఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సిపిఆర్ నేర్చుకోవడం పోలీసులకు చాలా ఉపయోగపడుతుందని, ఏప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేము, నిత్యం పోలీస్ అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారని ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే వెళ్ళేది పోలీసులు తర్వాత (108) డాక్టర్లని కావున ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకుంటే తప్పకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన వాలం అవుతంమని సూచించారు. నారాయణపేట జిల్లాలో హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు పోకుండా చూడాలని, కావున సిపిఆర్ ప్రతి ఒక్కరు నేర్చుకుని పక్కవారికి నేర్పించాలని సూచించారు. అనంతరం డాక్టర్ రాకేష్ గారు CPR అనేది ఛాతీ కుదింపులతో కూడిన అత్యవసర ప్రక్రియ , ఇది తరచుగాకృత్రిమ వెంటిలేషన్‌తో కలిపి లేదా నోటి నుండి నోటిని మాన్యువల్‌గా చెక్కుచెదరకుండా మెదడు పనితీరును మాన్యువల్‌గా కాపాడే ప్రయత్నంలో ఆకస్మిక రక్త ప్రసరణ, శ్వాసను పునరుద్ధరించడానికి తదుపరి చర్యలు తీసుకోబడుతుందనీ అందరికీ చూపించారు. శిక్షణలో ఎవరైనా వ్యక్తి అపస్మారక స్థితిలో కింద పడిపోయినప్పుడు అతనికి చాలామంది ఉద్యోగులకు సిపిఆర్ ఎలా చేయాలో అనే దానిపై బొమ్మల ద్వారా చేసి చూపించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో జయ చంద్ర మోహన్, స్టాఫ్ విజయ్ కుమార్, RI నరసింహ, ఎస్సైలు నరేష్, పురుషోత్తం, శివ శంకర్ మద్దయ్య, శ్వేత, శిరీష జిల్లా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.




