నేటి సాక్షి,వేమనపల్లి;
జిల్లా కేంద్రంలో జరిగే 2వ సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ కోరారు.గురువారం వేమనపల్లి మండల కేంద్రంలో సిపిఐ రెండో మహాసభ మండల కార్యదర్శి అందె పురుషోత్తం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.ముందుగా సీనియర్ కార్యకర్త దేవర బోయిన శంకర్ జెండా ఆవిష్కరణ చేయగా భవిష్యత్తులో మండలంలో పార్టీ నిర్మాణం కోసం పాటుపడాలని ఈ నెల 21,22వ తేదీన మంచిర్యాలలో జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని,మండలంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచాలని,ముఖ్యంగా అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈ మహాసభలో మండల కార్యదర్శిగా అందె పురుషోత్తం,సహాయ కార్యదర్శిగా బద్దంపల్లి శంకర్,కోశాధికారిగా బాపు 11 మంది సమితి సభ్యులుగా ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.





