Tuesday, March 10, 2026

సిపిఐ మండల కార్యదర్శిగా పి.దేవేంద్ర గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక


—– పేదలకు ఇళ్ల స్థలాలు మరియు ఇండ్ల పంపిణీ.
—– కార్మికులకు కనీస వేతనాల అమలు.
—– నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు.తుక్కుగూడలో ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటు

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మహేశ్వరం–కందుకూరు 12వ మండల మహాసభ మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఎస్‌విజె కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది.ఈ మహాసభలో మండల స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పి.దేవేంద్ర గౌడ్ మండల కార్యదర్శిగా,డి.బ్రహ్మచారి మండల సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.అంతేకాకుండా 21 మంది కౌన్సిల్ సభ్యులు,9 మంది కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.మహాసభలో పలు కీలక తీర్మానాలు చేశారు. ముఖ్యంగా:పేదలకు ఇళ్ల స్థలాలు మరియు ఇండ్ల పంపిణీ,కార్మికులకు కనీస వేతనాల అమలు,నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు,తుక్కుగూడలో ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటు.ఈ తీర్మానాలను రాబోయే మూడేళ్ల కాలంలో అమలు చేయాలనే సంకల్పంతో నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది.మహాసభలో తీసుకున్న తీర్మానాలను అమలు చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి.దత్తు నాయక్ పిలుపునిచ్చారు.జిల్లా నాయకత్వం అందించిన సహకారానికి మహాసభ తరఫున అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News