బెజ్జంకి పీహెచ్లో సిబ్బంది లేక సేవలు స్తంభననేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు. శుక్రవారం పీహెచ్సీ నీ సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, “24 గంటల వైద్య సేవలు అందించాల్సిన కేంద్రంలో ఒకే కాంట్రాక్ట్ నర్సు విధులు నిర్వర్తిస్తోంది. ఏఎన్ఎం, సిహెచ్ఓ, ఫార్మసిస్ట్, మేల్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా అధికారులు ఇప్పటికే రెండు సార్లు సందర్శించినప్పటికీ సిబ్బంది నియామకాలు జరగలేదని విమర్శించారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే సిబ్బంది నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు బోనగిరి శ్రావణ్, రొడ్డ చరణ్, అంతటి రాకేష్, ప్రకాష్, హరి తదితరులు పాల్గొన్నారు.





