Thursday, March 19, 2026

సిబ్బంది సమయపాలన పాటించాలి..ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్…చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్ సీ)ని ఇంచార్జి కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు,ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. ప్రసవాల సంఖ్యపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News