*మీక్ష* జిల్లాలో డ్రగ్స్ , మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలో బుధవారం నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి ఆరోగ్య చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, గంజాయితో కలిగే ఇబ్బందులపై యువత, విద్యార్థులకు ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష,పాల్గొన్నారు.





