Thursday, March 19, 2026

సిర్పూర్, టి లో కళ్యాణ లక్ష్మి.షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 20సిర్పూర్ (టి)మండలంలోని రైతు వేదికలో ఈ రోజు 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం లాంఛనంగా ఇస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఆసిఫాబాద్ నుండి మాకుడి వరకు డబల్ బీటీ రోడ్డు, అచ్చెల్లి నుండి ఆరేగూడ వరకు బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ని కలిసి సిర్పూర్(టి) రైల్వే స్టేషన్ కు సంబంధించి పలు అభివృద్ధి పనుల గురించి వివరించానని,దక్షిణ్ ఎక్స్ ప్రెస్, బల్లార్షా ఎక్స్ప్రెస్ లకు సిర్పూర్ టౌన్ లో అదనపు స్టాపేజీ మరియు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ సిర్పూర్ వరకు పొడిగించాలని కోరడం జరిగిందని తెలిపారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మార్వో రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఆర్ఐ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్లు వేణు, సాయి, భాజపా మండల అధ్యక్షులు లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News