*నేటి సాక్షి* తిరుమలాయపాలెం 9 మెట్టు రుద్రరాజు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి. సుబ్లేడ్ గ్రామానికి చెందిన గుంజ ఈదమ్మ కి మోకాలు ఆపరేషన్ జరిగింది వారికి ఆర్థిక సహాయంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో 75 వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుని రామ సహాయం నరేష్ రెడ్డి మరియు సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బత్తుల వెంకటనారాయణ, వార్డు మెంబర్ బండారు రాంబాబు, చారి శ్రీరాములు, కట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ లింగయ్య, కాళ్ల లింగయ్య ,బోడ రమేష్ ,మెట్టు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





